ఎస్.ఐ చంద్రభాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జోగురామన్న...
ఆదిలాబాద్ , పెన్ పవర్ఆదిలాబాద్ ఇటివల కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఎస్.ఐ. చంద్ర భాన్ కుటుంబ సభ్యులను సోమవారం ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న పరామర్శించారు. ఎస్.ఐ కుటుంబీకులతో కలిసి మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆదివాసిల సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువస్తూ మంచి పేరు గడించిన ఎస్.ఐ మృతి పట్ల ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఎస్.ఐ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట ఆదివాసి ప్రధాన్ జిల్లా అధ్యక్షులు దుర్వ నగేష్, పూసమ్ ఆనందరావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, గోడం గంగారం, రామెల్లి లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment