ఉచిత పంటల భీమా కోసం బయోమెట్రిక్ వేయాలి
పెన్ పవర్, కరప
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వైయస్సార్ ఉచిత పంటల బీమా సౌకర్యం పొందాలంటే రైతులందరూ తమ సమీపంలోని రైతు భరోసా కేంద్రంకెళ్ళి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేయాలని మండల వ్యవసాయ అధికారి ఏ.గాయత్రీదేవి తెలిపారు.రైతులు ఆధార్ కార్డు తీసుకుని ఆర్బికేల వద్దకు వెళితే విఏఏ లు రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకొని, వేలిముద్ర తీసుకుంటారు అన్నారు.కరప ఆర్బికే ను శనివారం ఆమె సందర్శించి వీఏఏ కే.కిరణ్మయి, ఆర్.సత్యప్రసాద్ లకు సూచనలు చేశారు.మండల పరిధిలో 1,4631మంది రైతులు ఉండగా ఇంతవరకు సుమారుగా 1,850 మంది వరకు రైతులు వైఎస్సార్ బీమా కోసం నమోదు చేయించుకోవడం జరిగిందన్నారు.సిగ్నల్ లేక బయోమెట్రిక్ తీసుకోవడం ఆలస్యమవుతున్నట్టు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది అని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
No comments:
Post a Comment