రెవెన్యూ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు
వేములవాడ, పెన్ పవర్
వేములవాడ మున్సిపల్ ఆఫీస్ లో సోమవారం మరియు బుధవారం నిర్వహిస్తున్న రెవెన్యూ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు పేరు మార్పిడి జరిగి ఆన్లైన్లో నమోదు కాకున్నా , ఇంటి నెంబర్ వచ్చి ఆన్లైన్ లో ఎంట్రీ కాకున్నా ఇంటి నెంబర్ లో తప్పు ఉన్న అదేవిధంగా ఇంటి కొలతల లో హెచ్చు తగ్గులు ఉండి ఇంటి టాక్స్ ఎక్కువ రావడం మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్న వారికి సత్వరమే సమస్య పరిష్కరిస్తామని, అందులో భాగంగా నే గత బుధవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ మేళా లో మా దృష్టికి కమిషనర్ దృష్టికి వచ్చిన ఇంటి కొలతలలో హెచ్చుతగ్గులు ఉండి 12000 వేల రూపాయలు ఎక్కువ టాక్స్ వచ్చిన సదరు వ్యక్తి కి సమస్య పరిష్కరించి టాక్స్ రసీదు అందజేయడం జరిగింది. పట్టణ ప్రజలు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా మున్సిపల్ ఆఫీస్ లో దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకో గలరు అని వారు కోరారు.
No comments:
Post a Comment