Followers

ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ప్రభుత్వం బాసటగా ఉండాలి

 ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ప్రభుత్వం బాసటగా ఉండాలి...

 రైతు స్వరాజ్య వేదిక, రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షులు సంగెపు బుర్రన్న

 బేల , పెన్ పవర్

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలవాలని రైతు స్వరాజ్య వేదిక, రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షులు సంగెపు బుర్రన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా  బేలా మండలం లోని భవాని గూడ గ్రామానికి చెందిన ఆత్రం దేవిదాస్ అనే రైతు  ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక, రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న గ్రామస్తుడు సీతారాం తో కలిసి వాస్తవ  ఆర్థిక వ్యవసాయ పెట్టుబడులు దిగుబడులపై  నిజనిర్దారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవంగా గత 2,3సంవత్సరాల నుండి అనావృష్టి అతివృష్టి ఉండడం మూలంగా ,మరొక పక్క ఈ సంవత్సరం నకిలీ విత్తనాలు అంటగట్టి పంట దిగుబడి రాక మనోవేదనకు గురై గత నెలలో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు.ఈ రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన జిఓ నంబర్ 194 ప్రకారంగా 6 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి  ఈ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కుటుంబ యజమానురాలికి నెలకు 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వీరి పిల్లలకి ఉన్నతమైన విద్య,వైద్య సదుపాయాలు ఉచితంగా అందించి నెలసరి ఆదాయం  రు.15 వేల రూపాయలు వచ్చేవిదంగా చిరు ధాన్యాలను పండించే విదంగా ప్రోత్సహించాలని ,రైతు ఆత్మహత్యలు జరుగకుండా గ్రామ గ్రామాన రెవెన్యూ ,వ్యవసాయ శాఖ వారు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ప్రభుత్వ యంత్రంగాన్ని కోరరు.తమ పంటలను అడవి జంతువుల నుండి  కాపాడుకోవడానికి సామూహిక సోలార్ కంచెను ఏర్పాటు చేయలని  ప్రభుత్వాన్ని కోరుతున్నాను .ఈ కుటుంబానికి రైతు భిమాతో పాటు  194  జిఓ  ను ఆమలు చేసి  వీరి ఆర్థిక భారాన్ని తగ్గించే విదంగా  ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందనీ న్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...