Followers

టాను నాయక్ పోరాట స్ఫూర్తితో గిరిజన శక్తి ఉద్యమం ఉదృతం చేస్తాం

 టాను నాయక్ పోరాట స్ఫూర్తితో గిరిజన శక్తి ఉద్యమం ఉదృతం చేస్తాం

తార్నాక ,  పెన్ పవర్

గిరిజన శక్తి ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో టాను నాయక్ 71వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు.  ఈ సందర్బంగా జాటోత్ టాను నాయక్  కు ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు టాను నాయక్ స్ఫూర్తితో తెలంగాణ గిరిజన సమస్యలను పరిష్కరించే విధంగా, జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ సాధనకై పోరాడుతామని గిరిజన శక్తి నేతలు తెలిపారు.  ఆగస్టు 8న  నిజాం కళాశాల గ్రౌండ్లో గిరిజన గర్జన గిరిజన సాంస్కృతిక మహా ప్రదర్శన సభను నిర్వహిస్తామని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్ తెలిపారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ బహుజన వర్గాలలో ఐక్యత రావాలని అందరం కలిసి రాజ్యాధికారం దిశగా పయనించాలన్నారు. చరిత్ర మరచిన చాలామంది వీరుల చరిత్రను బయటికి తేవాలని గిరిజన శక్తి చేస్తున్న ఉద్యమాన్ని అభినందించారు.  ఐఈఎస్ ఆఫీసర్ నాయక్ దేవి లాల్ మాట్లాడుతూ అందరం ఒక తాటిపైకి వచ్చి గిరిజన రాజ్యాంగ హక్కుల కోసం కృషి చేయాలని గిరిజన శక్తి పోరాటానికి అండగా నిలబడాలని కోరారు. ప్రొఫెసర్ రవి నాయక్ మాట్లాడుతూ ట్రైబల్ యూనివర్సిటీ  గురించి గిరిజన శక్తి  చేసిన ఉద్యమాన్ని గుర్తుచేస్తూ సాధించేంతవరకు పోరాడాలని తెలిపారు. గిరిజన కవి రచయిత యాకూబ్ నాయక్, టి జి వి ఎస్ అధ్యక్షులు నెహ్రు నాయక్, గిరిజన శక్తి ప్రధాన కార్యదర్శి పాండు నాయక్, ఓయూ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ఓయూ అధ్యక్షులు సిద్ధార్థ రాథోడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు జోష్నా, అధికార ప్రతినిధి ఉపేందర్ రాథోడ్, హైదరాబాద్ అధ్యక్షులు జె.డి నాయక్,గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...