జాతీయ జెండాకు వందేళ్లు
తాళ్లపూడి, పెన్ పవర్
జాతీయ జెండాకు రూపకల్పన చేసి నేటితో వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక శ్రీ విజేత ఉన్నత పాఠశాల నందు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ మోపిదేవి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ జెండాకు విద్యార్థులు గౌరవం వందన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. జె వి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జెండా రూపకర్త పింగళి వెంకయ్య కు భారతరత్న ప్రదానం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకట్, అనిత, కరిష్మా, స్వాతి, రేష్మా, భ్రమరాంబ, కరుణ విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment