Followers

అచ్చుతాపురం అంగన్వాడీ కేంద్రంలో అవకతవకలు

 అచ్చుతాపురం అంగన్వాడీ కేంద్రంలో అవకతవకలు




గోకవరం, పెన్ పవర్ 


తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురం  గ్రామం లో రెండవ  నంబర్ అంగన్వాడి కేంద్రం లో బాలింతలు మరియు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు అందించ వలసిన  పోషక ఆహారాన్ని సక్రమంగా ఇవ్వడం లేదని  గ్రామస్తులు కోరుకొండ ఐసిడిఎస్ పిడి కి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లాల వెంకన్నబాబు గ్రామస్థులతో కలిసి  అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడి కేంద్రం నిర్వహణలో లోపాలు పై కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి వెళ్లి    సిడిఒ కు పిర్యాదు చేశారు. అనంతరం నల్లాల వెంకన్న బాబు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు సుమారు 100 మందివరకు ఉన్నారన్నారు. అయితే వీరికి ప్రభుత్వం అందిస్తున్న పోషకపదార్థాలను సక్రమంగా అందించడం లేదని ఆయన ఆరోపించారు. 25 గుడ్లు ఇవ్వాల్సి ఉండగ 15 గుడ్లు మాత్రమే ఇస్తున్నారని, రెండున్నర లీటర్ల పాలకు లీటర్ నర లీటర్లుమాత్రమే పాలు ఇస్తున్నారని, మూడు కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా రెండు కేజీల బియ్యం మాత్రమే ఇస్తున్నారని, అరకేజీ నూనె ఇవ్వాల్సి ఉండగా డబ్బా తో కలిసి ఇస్తున్నారని అన్నారు. రికార్డుల్లో మాత్రం మెనూ ప్రకారం ఇస్తున్నట్లు  రికార్డు పూర్తిస్థాయిలో ఇస్తున్నట్లు నమోదు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అచ్చుతాపురం లోని రెండవ నెంబర్ కేంద్రంలో నిర్వహణ లోపాలపై విచారణ జరపాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...