డప్పు చెప్పు కు పెన్షన్ మాదిగల హక్కు
యం అర్ పి ఎస్ టీ ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్ మాదిగ
ఇబ్రహింపట్నం, పెన్ పవర్
ఇబ్రహింపట్నం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న,రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గార్ల పిలుపు మేరకు కోరుట్ల నియోజక వర్గ ఇంఛార్జి బండ ప్రవీణ్ మాదిగ ఆధ్వర్యంలో డప్పు కొట్టే, చెప్పులు కుట్టే వాళ్ల కు పెన్షన్ ఇవ్వాలని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ టీఎస్ జగిత్యాల జిల్లా అద్యక్షులు గంగాధర నరేష్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 2018 అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా డప్పు చెప్పులు కుట్టే వాళ్లకు నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాం ఈ మార్చి నెల లో జరగబోయే అసెంబ్లీ సమావేశం లోనే నెలకు రెండు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తానని అసెంబ్లీలోనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం మాదిగ జాతి బిడ్డల కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రాబోయే రోజుల్లో మీకు మంచి రోజులు వస్తాయని గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు బ్యాంక్ ల తో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ తెలంగాణ నాయకులు చిట్యాల వినోద్ ,నక్క అరుణ్, నక్క గణేష్ , మద్దూరి నవీన్ జేరిపోతుల అనిల్, వినయ్,కొమ్ముల లక్ష్మను, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment