స్థానిక సుజాత కన్వెన్షన్ హాల్లో అభినందన పూర్వక కార్యక్రమం
విజయనగరం,పెన్ పవర్నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సుజాత కన్వెన్షన్ హాల్లో అభినందన పూర్వక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ప్రతి ఒక్కరూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా కచ్చితమైన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా పత్రిక మరియు మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాదరావు మాట్లాడుతూ కమిషనర్ పద నిర్దేశనం లో సిబ్బందంతా చేసిన కృషి మరువలేనిదన్నారు. ఇదే ఒరవడితో మున్ముందు మరిన్ని విజయాలు సాధించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన తహసిల్దార్ ప్రభాకర్రావు మాట్లాడుతూ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ సలహాలు, సూచనలతో నగర పాలక సంస్థ అధికారులు చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, వార్డు కార్యదర్శులు, పత్రిక మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment