బంద్ విజయవతం
పెద్దాపురం,పెన్ పవర్రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రలో బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా, వ్యవసాయరంగంలో తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టం 2020 రద్దు చేయాలని, అధిక ధరలు తగ్గించాలని దేశవ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతుసంఘాల ఆధ్వర్యంలో జరిగిన భారత్ బంద్ పెద్దాపురంలో విజవంతంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఎం నాయకులు బంద్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచే ఐక్యకార్యాచరణ కమిటీ కార్యకర్తలు మెుయిన్ రోడ్, సినిమా సెంటర్, మున్సిపల్ సెంటర్, ధర్గా సెంటర్, వేములవారి సెంటర్ లో బంద్ చేయాలని విజ్ఞాప్తి చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. స్వచ్చందంగా వ్యాపారులు బంద్ లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా మెుయిన్ రోడ్ వినాయకుడు గుడి సెంటర్ లో సిఐటియు మండల కార్యదర్శి దాడి బేబి అధ్యతన సభ జరిగింది. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ రాజా సూరిబాబు రాజు, జనసేన నాయకులు వంగలపూడి సతీష్, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, ఐఎఫ్.టి.యు నాయకులు వి.చిట్టిబాబు, ఎఐటియుసి అధ్యక్షులు త్రిమూర్తులు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణలు ప్రసంగించారు. మెాడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే దేశంలో ఉన్న అనేక వాటిని అమ్మేసారని ఇప్పుడు మరింత దూకుడుగా 100 శాతం అమ్మేయడానికి పూనుకుంటుందని అన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ఆంధ్ర ప్రజలకు దూరం చేయడానికి పూనుకుందని అన్నారు. పోరాటాలు, త్యాగాల విలువ బిజెపికి ఏనాడు తెలియదని అన్నారు. దేశాన్నికి తిండి పెడుతున్న రైతులు 130 రోజులుగా రోడ్డుపై ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ బంద్ తో అయినా ప్రభుత్వం దిగిరావాలని లేని పక్షంలో మరింత ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్ లు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, బాబ్జి, బాబురావు, డి.క్రాంతి కుమార్, బుడతా రవీంద్ర, పి.వీరబాబు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తాడిశెట్టి గంగా, పొతాబత్తుల చిన్నిబాబు, మల్లాడి శ్రీను, ఎఐటియుసి నాయకులు త్రిమూర్తులు, అల్లు బాలాజీ, మజ్జి సత్యనారాయణ, రామకృష్ణ, డొప్పా కృష్ణ, బానాతి చందరావు, ఐఎఫ్.టి.యు నాయకులు లావేటి రాజు, మయూరి, రాంబాబు, తెలుగుదేశం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంది సత్తిబాబు, తూతిక రాజు, ఎలిశెట్టి నాని, కురందాసు గణేష్, పెదకాపు,ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ, సత్యవతి, సుబ్బలక్ష్మీ, అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇ.ఉమామహేశ్వరి, జాగారపు కుమారి, పద్మ, ఇందిరా, సిపిఎం నాయకులు ఎస్.శ్రీనివాస్, అప్పన్న, ఎన్.నరసింహమూర్తి, మరిడియ్య, ప్రజానాట్యమండలి నాయకులు డి.కృష్ణ, ఆర్.వీర్రాజు, డి.సత్యనారాయణ, ఎమ్.రాంబాబు, డివైఎఫ్ఐ కన్వీనర్ రమేష్, నాగేశ్వరరావు, హెచ్ పి గ్యాస్ యూనియన్ నాయకులు నాయుడు, కృష్ణ తదితరులు పాల్గోన్నారు.
దివిలిలో బంద్ విజయవంతం
దివిలి చంద్రమాంపల్లి సెంటర్ లో బంద్ విజయవంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్చందంగా షాపులను మూసి బంద్ కి మద్దతు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కేదారి నాగు, ఎమ్.సత్తిబాబు, సిఐటియు నాయకులు మాగాపు నాగు, పాపేశ్వరరావు, జి.రాజా లు పాల్గోన్నారు.
No comments:
Post a Comment