Followers

బస్సు నీ డీకొని ఒకరి మృతి మరోకరికి తీవ్ర గాయాలు

బస్సు నీ డీకొని ఒకరి మృతి మరోకరికి తీవ్ర గాయాలు 

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

ఉత్తర నియోజక వర్గం పరిథి ఐ.టి.ఐ కూడలి జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనం బస్సు నీ డీకొని ఒకరి మృతి చెందగా మృతి మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబందించి కంచరపాలెం ట్రాఫీక్ ఎస్.ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఎన్.ఏ.డీ కూడలి నుండి విధులకు వెళ్తున్న జితేంద్ర ( 27 ) అతడి స్నేహితుడు ఇరువురు ద్విచక్ర వాహనంపై ఆర్.అండ్.బి కూడలి జాతీయ రహదారి మీదుగా తాటిచెట్లపాలెం వైపు వెళ్తున్న క్రమంలో ఐ.టి.ఐ కూడలి వద్దకి వచ్చే సరికి ఒక్క సారిగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న బస్సు కిందకి దూసుకుపొయింది.ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న జితేంద్ర కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా మార్గ మద్యలో మృతి చెందాడు.అతడితో వున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...