Followers

భీమేశ్వరాలయంలో హైకోర్టు జస్టిస్ దంపతులు పూజలు

భీమేశ్వరాలయంలో హైకోర్టు జస్టిస్ దంపతులు పూజలు

సామర్లకోట, పెన్ పవర్

పంచారామా క్షేత్రమైన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో హైకోర్టు జస్టీస్ బి కృష్ణమోహన్ దంపతులు  ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన జడ్డి దంపతులకు ఆలయ మర్యాదల చొప్పున పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు భీమేశ్వరుని, బాలా త్రిపుర సుందరీ అమ్మవారలను దర్శించుకుని ప్రత్యేక పూజలను చేపట్టారు. అలాగే ఆలయంలోని ఉపాలయాల్లోని దేవతామూర్తులను వారు దర్శించుకోగా ఆలయ విశేషాలను ఆలయ పండితులు జడ్జి దంవతులకు వివరించారు. అనంతరం వారికి ఆలయ నంది మండపంలో ఘనంగా పండితాశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి, అమ్మవారి చిత్ర పటాలను, ప్రత్యేక ప్రసాదాలనందించి గౌరవించారు. ఈ పూజల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, డిప్యూటీ తహశీల్దారు ఆర్ శ్రీనివాసరావు, హైకోర్టు జడ్జి దంపతుల వెంట జిల్లాకు చెందిన పలువురు జడ్జిలు, విఆర్వోలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...