కేసీఆర్ కి పాలాభిషేకం చేసిన ఎంపీపీ....
పెన్ పవర్, మేడ్చల్మెడ్చల్ మండల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద మండలాలకు నిధులు కేటాయించినందుకు గాను స్థానిక ఎంపీపీ పద్మజగన్ రెడ్డి అధ్యక్షతలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జెడ్పిఛైర్పెర్సన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చేయుటకు కేసీఆర్ విడుదల చేసిన నిధులకు గాను అన్ని గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసుకోవచ్చని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దే విధంగా నిధులు కేటాయించారని సంతోషం వెక్తంచేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి, గోపని వెంకటేష్, రఘు , ప్రకాష్ , హేమలత , అంకిత రావి మరియు కో ఆప్షన్ మెంబెర్ రుక్సానా పాషా , టిఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment