గాయపడిన జర్నలీస్ట్ రెహమాన్ కు అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు
పెన్ పవర్, మల్కాజిగిరి
ఇటీవల ప్రమాదవశాత్తు వాహనంపై నుంచి కిందపడి గాయపడిన గౌతంనగర్ డివిజన్ సాక్షి విలేకరి అబ్దుల్ రెహమాన్ ను శనివారం వాట్సాప్ గ్రూప్ సభ్యులు తన నివాసనికి వెళ్లి పరామర్శించారు. గ్రూప్ సభ్యులు ఉడతాభక్తిగా ఆర్థికటు సహాయం అందించారు, జర్నలీస్టులకు అండగా ఉంటామని కుమ్మరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, మైత్రినాథ్, మల్లేష్ యాదవ్,శ్రీ రామ్ యాదవ్, బిక్షపతి,శ్రీనివాస్ చారి,కొలువుల లక్ష్మణ్ రావు, సిద్ధిరాములు,గ్యార ప్రవీణ్, రషీద్, జగపతి, విగ్నేష్ ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment