Followers

దేశవ్యాప్త సమ్మెకు నగర కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

 దేశవ్యాప్త సమ్మెకు నగర కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు.. సంకు వెంకటేశ్వర రావు

మహారాణిపేట,పెన్ పవర్

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక,ఉద్యోగ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు నగర కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. నూట పది రోజులకు  పైగా ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కోటి యాభై లక్షల మంది ఆందోళన చేస్తున్నా కేంద్రప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లైనా లేదని విమర్శించారు.కార్పొరేట్లకు లాభం చెయ్యడం కోసమే మూడు కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు కు ప్రయత్నిస్తున్నారన్నారు.32 మంది ప్రాణత్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు  అంటూ ఉద్యమించి సాదించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను  విదేశీ పెట్టుబడిదారులకు కారుచౌకగా ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్,డీజిల్, గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ శ్రేణులు బందులో పాల్గొంటారని,నగర ప్రజలు,వ్యాపారస్తులు కూడా దేశవ్యాప్త బందుకు స్వచ్చందంగా సహకరించాలని సంకు వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...