ప్రజాసేవకురాలిగా సేవలందిస్తా...
మహాసేవకుడి మాట నిలుపుతా..
34వ వార్టు వైసీపీ అభ్యర్థి బాలి పైడిరాజు..
నాయకుడంటే పాలకుడు కాదు..
నాయకుడంటే శాసించేవాడు కాదు..
పెన్ పవర్,విజయనగరం
నాయకుడంటే సేవకుడని,ప్రజా సేవకుడని భావించి, బోధించి, భాసించిన వ్యక్తి స్వర్గీయ బాలి త్రినాధ రావు. నగరంలో ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరది. బాలి త్రినాథ్ గా వాసికెక్కిన అయిన ఈమధ్యనే హితులందరికీ సెలవంటూ.. స్వర్గప్రాప్తి పొందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మహా సేవకుడి చెరగని సంతకంలా.. చెదరని జ్ఞాపకంగా.. ఆయన సేవాపరంపరకు కొనసాగింపుగా నగరంలోని 34 వ వార్డులో బాలి త్రినాద్ భార్య బాలిపైడిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వార్డు ప్రజలకు, కుటుంబానికి బాలి త్రినాద్ పెద్ద దిక్కుగా ఉంటూ వార్డు ప్రజలందరితో అభిమాన పాత్రుడిగా మసలుతూ, అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరమైనా ఆయన ప్రతిరూపాలైన బాలి యోగేంద్ర, బాలి నరేంద్ర, బాలి ప్రతాప్ లు తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రజా సేవ చేసేందుకు కంకణబద్ధులయ్యారు. అదే నేడు నగరం లో హాట్ టాపిక్ గా మారింది. రణక్షేత్రంలో యుద్ధ సైనికుల వాలే, ప్రజాక్షేత్రంలో జగన్ సైనికుల్లా 34వ వార్డులో ఈ ముగ్గురు అన్నదమ్ములు వీరోచిత సేవలందిస్తూ ఓట్లను అర్థిస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ తల్లిని ఆడపడుచులా ఆదరించి, అక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నారు. వారి అభ్యర్థనలతో వార్డు ప్రజల హృదయాలు బరువెక్కుతున్నాయి. మాటలు మూగబోతున్నాయి. ఓట్ల రూపంలో బాలి పైడిరాజు ను కార్పొరేటర్ గా గెలిపించి బాలి త్రినాద్ రుణాన్ని తీర్చుకోవాలని భావిస్తున్నారు. 34 వ వార్డు అభ్యర్థి బాలి పైడిరాజుది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.గజపతినగరం మాజీ శాసనసభ్యులు తాడ్డి సన్యాసప్పలనాయుడు ఆమెకు పెద్ద నాన్న కాగా, తదనంతర కాలంలో గజపతినగరం శాసనసభ్యులుగా సేవలందించిన స్వర్గీయ తాడ్డి వెంకట్రావు వరుసకు అన్నయ్య కూడా. వివాహం అనంతరం రాజకీయమే వ్యసనంగా, ప్రజాసేవే శ్వాసగా అందరి మన్ననలు అందుకున్న బాలి త్రినాథ్ కు భార్యగా బాలి పైడిరాజు తనదైన శైలిని ప్రదర్శించారు. ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే నైజం ఉన్న భర్త దొరకడం అదృష్టంగా భావించి, ఏనాడూ ఇతరులకు సేవ చేసే విషయంలో అడ్డుచెప్పకుండా మరింత సహాయం అందించాలని కోరడం వెనుక ఆమె పెద్ద మనసు మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పెద్దావిడకు నేడు కష్టం వచ్చింది. పెద్ద దిక్కు కోల్పోయి కంటి నీరే కాలం అయ్యింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆ పెద్దమనసుకి కష్టం వచ్చినప్పుడు ఆదరించడానికి అందరూ ముందుకు రావాలి. ఇదే తరుణం అంటూ ఎన్నికలు వచ్చాయి. అందుకే ఈ ఎన్నికలో తమ తల్లి శోకాన్ని దిగమింగుకొని జోలిపట్టి ఓట్లు అర్థిస్తోందని ఓ ఇంటర్వ్యూలో బాలి యోగేంద్ర చెమర్చిన కళ్ళతో చెప్పసాగాడు. ఇదిలా ఉంటే ప్రజాభిమానమే అండగా, ప్రజలే దండుగా ఉన్న ప్రియతమ నాయకులు, స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని 34 వార్డు అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పైడిరాజు ఆ వార్డు ప్రజలకు కోరుతున్నారు. ఇంటింటికి వెళ్లి తన భర్త స్వర్గీయ త్రినాథ్ సేవానిరతి కి బదులుగా ఓటు వేయండని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలియోగేంద్ర, ప్రతాప్, నరేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే వైసిపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. నిరంతర శ్రామికుడు, విజయనగర ప్రజల ముద్దుబిడ్డ, అందరిచేత అన్నయ్య అని పిలిపించుకునే అరుదైన వ్యక్తిత్వం ఉన్న స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి బలపరిచిన అభ్యర్థి తమ తల్లి గారైన పైడిరాజు ను అఖండ విజయంతో గెలిపించాలని కోరుతున్నారు.
పురపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా జగన్ సైనికుల్లా పని చేస్తామని భరోసా ఇచ్చారు. నిరంతరం ప్రజల మధ్య లోనే ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మాట ఇస్తున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తామని ప్రతినబూనారు. తమ తండ్రి స్వర్గీయ త్రినాధ రావు కరోనా సమయంలో ను ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, ప్రాణాలను తృణప్రాయంగా భావించి పేదలందరికీ నిత్యావసరాలను పంపిణీ చేసిన మహాసేవకుడని కొనియాడారు. ఆ మహా సేవకుడి ఆశయాలు, ఆకాంక్షలు నిరంతరం కొనసాగిస్తామని భావిస్తున్న తమకు మంచి మనసుతో దీవించి ఓట్ల రూపంలో గెలిపించి 34 వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా బాలి పైడిరాజు కు అఖండ విజయం చేకూర్చాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment