Followers

ఊపందుకున్న టిఆర్ఎస్ నేతల ప్రచారం

 ఊపందుకున్న టిఆర్ఎస్ నేతల ప్రచారం

 కేసముద్రం,పెన్ పవర్

ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎంపీపీ పొలం చంద్రమోహన్, మండల అధికార ప్రతినిధి మోడెం రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వం పథకాలకు నిదర్శనంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటు తో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. బ్యాలెట్ పేపర్ లో మూడో నెంబర్ పై ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,  పట్టణ అధ్యక్షుడు వీరు నాయక్, సీనియర్ నాయకులు ముత్యాల శివుడు,చంద గోపీ‌, వార్డు మెంబర్  తరాల వెంకన్న, నాయకులు రేవంత్, రాజేష్, రేణిగుంట్ల సుధాకర్, సింగంశెట్టి ఏకాంతం, కర్పూరపు మురళి, వెంకటేష్, వీరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...