కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ
సచివాలయసిబ్బంది స్పందన కార్యక్రమం లో
మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు
తప్పనిసరిగా హాజరు కావాలి
పెన్ పవర్, పెద్దాపురం
సచివాలయంలో జరుగు స్పందన కార్యక్రమానికి మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయ సిబ్బంది సచివాలయంలోనే ఉండాలని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం పెద్దాపురం మండలం జి. రాగంపేట సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. స్పందన కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది సచివాలయంలో హాజరుకాకపోవడం మాదృష్టికి వచ్చిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వత్తించిన, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో హాజరు కావాలని, దీనిపై మండలస్థాయి అధికారులు పర్యవేక్షణ వుండాలని అన్నారు. గత డిసెంబర్ నుండి నేటి వరకు ఆర్జీలు బయట మీ-సేవలో పెరుగుతున్నాయని ,సచివాలయంలో ఆర్జీలు తగ్గినవ ని దీనికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ నెల నుంచి సచివాలయ జీతాలు బయోమెట్రిక్ ద్వారా అనుసంధానం చేయడం జరుగుతుందని, దీనికో లాగిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ తనికీలోబయోమెట్రిక్ హాజరు జెసి పరిశీలించారు. హాజరుకాని సిబ్బంది వివరాలను సచివాలయ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో వచ్చిన అర్జీలు, పరిస్కరించిన అర్జీలు నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించారు. కౌలురైతులు గ్రామంలో ఎంత మంది ఉన్నారని, కౌలురైతు రుణ అర్హత కార్డు ఎంత మంది పొంది ఉన్నారని వ్యవసాయ సహాయకుడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ అప్పర్ ప్రైమర్ స్కూల్ నాడు-నేడు పనులు పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా పిల్లలుకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించి జాయింట్ కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు పెట్టిన భోజనాని భుజించారు. తదుపరి తరగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ డిఓ కె.ఎం.వి ప్రసాద్, ఎంపీడీఓ కె.రమణారెడ్డి, తహసీల్దార్ బి.శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి ఎం. సెలెక్టరాజు ఇఓపిఆర్డీ హిమమహేశ్వరి,ఎంఇఓ టి. జోసఫ్, హెచ్.ఎం కెనడి,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment