Followers

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి

 ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి

మందమర్రి,  పెన్ పవర్

నాణ్యతలేని నాసిరకం తిను పదార్థాల వలన ప్రజలు తమకు తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని,  ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆరోగ్య హక్కు వేదిక అధ్యక్షుడు, న్యాయవాది రాజలింగు మోతె డిమాండ్ చేశారు.ఈమేరకు పట్టణంలో నిబంధనలు పాటించని ఆహార పదార్థాలు విక్రయాదారులపై చర్యలు తీసుకోవాలని మందమర్రి మండల తహశీల్దార్ జాడి రాజలింగం, పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నిత్యం పట్టణంలో దినసరి కూలీలు , కాంట్రాక్టు కార్మికులు , ఆటోడ్రైవర్లు, ఉద్యోగులు వారి తీరిక లేని పనుల కారణంగా రోడ్డు ప్రక్కన ఉన్న స్టాల్ల్స్,హోటల్స్,తినుబండారాల వైపు మొగ్గుచూపుతున్నారని,వాటి నిర్వాహకులు శుచి,శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు.ఉపయోగించిన నూనె ను మళ్లీ ఉపయోగిస్తున్నారని,కొన్నిచోట్ల మురుగుకాల్వల ప్రక్కనే విక్రయాలు జరుపుతున్నారని పేర్కొన్నారు.ఆహార పదార్థాల పై ఎలాంటి తెరలు, గాజు బాక్సులను ఏర్పాటు చేయకపోవడం వలన ఈగలు,దోమలు చేరి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.వాహనాల రాకపోకల సమయంలో రోడ్డు ప్రక్కన ఉన్న స్టాల్ల్స్,హోటల్స్ లోని తినుబండారాలపై దుమ్ము,ధూళి పడటం వల్ల బ్యాక్టీరియా చేరుతుందని ఆరోపించారు.ఆహారపదార్థాలకు తయారీకి నాసిరకమైన నిత్యావసర వస్తువులు,కలుషితమైన నీరు వాడటం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.రోడ్డు ప్రక్కన ఉన్న స్టాల్ల్స్, హోటల్స్, తోపుడుబండ్ల నిర్వాహకులు ఆహార పదార్థాలు అందించేటప్పుడు చేతులకు తొడుగులు ధరించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో వేదిక సభ్యులు శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...