విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలి...
పెన్ పవర్,ఉలవపాడు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సీ.ఐ.టీ.యు,సి.పి.ఎం. ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బంద్ కార్యక్రమాని శుక్రవారం నిర్వహించారు. సిఐటియు నాయకులు బ్యాంకులు,ప్రభుత్వ ఆఫీసులు,విద్యా సంస్థలను మూసివేయించారు.మండల కేంద్రంలో పాత బస్టాండ్ సెంటర్ నుంచి హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం ప్రజా,కార్మిక,ఉద్యోగ వ్యతిరేక చర్యలు తక్షణమే మానుకోవాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జీవీబీ.కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెలికం,యల్.ఐ.సీ, బ్యాంకులు,పోర్టులు,రక్షణ రంగాలను ప్రైవేటీకరణ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గమన్నారు. అన్ని అమ్మెస్తామని ప్రధాని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. అనేకమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే చర్యలు ఈ బంద్ తోనైనా మానుకోవాలని హితవు పలికారు.లేదంటే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ బంద్ కు బ్యాంక్,రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.డి.గౌస్ బాషా,సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి.జె.సురేష్ బాబు,సి.ఐ.టి.యు.నేతలు వాకా.లతారెడ్డి, సిహెచ్. ఇందిరా వతి, ఎస్.డి.రసూల్ బాషా,సి.పి.ఎం.నాయకులు ఏలూరు నాగార్జున,ఆటో వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పీ.మస్తాన్ రావు, షేక్.కరిముల్లా,ఎస్.డి.జహీర్, బండి సుబ్బారావు, కార్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్.ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వహించారు.
No comments:
Post a Comment