Followers

వాణిదేవిని గెలిపించాలని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

 వాణిదేవిని గెలిపించాలని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

వికారాబాద్ ,పెన్ పవర్ 

పరిగి మండలం  సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ పద్మా దేవేందర్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవిని ఎమ్మెల్సీగా గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు  అందుకు సైనికులుగా పనిచేయాలని,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షకుపైగా  ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని , బిజెపి పాలిత రాష్ట్రాలలో    మహిళలపై ఆగడాలు జరుగుతున్నాయని, బిజెపి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను   దివాలా తీయించి బిజెపి నాయకులు చూపు తెలంగాణ ప్రభుత్వం పై పడిందని ఎల్ఐసి ,బిఎస్ఎన్ఎల్ లను ప్రవేట్ పరం చేసిన ఎవరని  ఈ సందర్భంగా వారు ప్రశ్నించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి  హరిప్రియ రెడ్డి, ఎంపీపీ అరవింద్ సీనియర్ నాయకులు  ప్రవీణ్ కుమార్ రెడ్డి,  ఆంజనేయులు, సురేందర్ , తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...