Followers

తాండూర్ ఎస్.ఐ ఉదారత

 తాండూర్ ఎస్.ఐ ఉదారత


 తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా ,తాండూర్ మండల్ సబ్ ఇన్స్పెక్టర్  శేఖర్ రెడ్డి తన సొంత ఖర్చులతో మాస్కులు లేని వారికి మాస్కులను అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో కరోనా  ఎక్కువగా ఉన్నందున పతి ఒక్కరు మాస్కులను తప్పకుండా ధరించాలని, తప్పని పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు అని , సమ దూరం పాటించాలి అని, ప్రజలు సభలు సమావేశాలు, ప్రార్థన మందిరాలలో, బస్టాండ్ లో కూరగాయల మార్కెట్, దుకాణ సముదాయల వద్ద గుంపులుగుంపులుగా ఉండకుండా మాస్క్లను ధరిస్తూ సమదూరాన్ని పాటించాలన్నారు. మాస్క్లు ప్రతి ఒక్కరు ధరిoచాలని లేనియెడల వారికి 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు శిక్షణ ఎస్ఐ మహేష్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...