ఎన్నికైన నాయకులు వై.ఎస్.ఆర్.పార్టీ. కీర్తిప్రతిష్ఠలు పెంచాలి
వి.మాడుగుల,పెన్ పవర్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై అభిమానంతో ప్రజలు పార్టీకి ఓటు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినాయకుడు పనిచేసి పార్టీ గౌరవం పెంచాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని కృష్ణాపురం నూతన పంచాయితీకి ఎన్నికైన పాలకవర్గ అభినందన సభలో ప్రసంగించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేయడం వల్ల పార్టీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని సూచించారు. గెలిచాం కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలకు పార్టీకి దూరం కావలసి ఉంటుందన్నారు. చిన్న పంచాయతీ లో వార్డు మెంబర్ గా మొదలైన తన జీవితం ఎమ్మెల్యే స్థాయికి తీసుకు వెళ్లిందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఆలోచించే నాయకుడికి భవిష్యత్ ఉంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పేదల కన్నీళ్లు తుడిచేందుకు సాహసోపేత పధకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలన్న జగన్ లక్ష్యాన్ని అందరూ పాటించాలని కోరారు. పార్టీలకతీతంగా పేదలకు జగనన్న సంక్షేమ పథకాలు అందించాలని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. ఎం కృష్ణాపురం పంచాయతీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ పై ప్రజలు చూపిన అభిమానం మరువలేనిదని బూడి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సర్పంచులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment