Followers

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బంద్

 ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బంద్

కూకట్ పల్లి,పెన్ పవర్




ప్రఖ్యాతి గాంచిన ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య మొదలగు కళాశాలల ఫీజుల దోపిడీకి నిరసనగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం కూకట్ పల్లి లోని ప్రేవేట్ కాలేజీల బందుకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలు చేపడుతున్న అధిక ఫిజుల వల్ల పేద విద్యార్థులు డబ్బులు చెల్లించలేక విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, కొందరు విద్యార్థులు అవమాన భారంతో ప్రాణాలు కూడా తీసుకున్నారని, ప్రభుత్వం ఇలాంటి కళాశాలపై చర్యలు తీసుకొని ఫీజులను తగ్గించాలి అన్నారు. కరోన కాలంలో కొన్ని విద్యాసంస్థలు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించ లేదని, ఈవిషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. రానున్న కాలంలో ఫీజుల దోపిడీ అరికట్టని యెడల బీసీ విద్యార్థి సంఘం అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇంచార్జ్ తెల్ల హరికృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థుల అధ్యక్షుడు తన్నీరు ప్రసాద్, చింతల యాదగిరి, కమలాకర్, రాము, కొట్టు వేణు, తెల్ల చంద్రశేఖర్, వేణుగోపాల్, రాహుల్ తేజ, నరసింహ, దండే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...