Followers

వివిధ శాఖలలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

 వివిధ శాఖలలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: ఏబీవీపీ




కూకట్పల్లి, పెన్ పవర్

రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం కూకట్ పల్లి లోని జె.ఎన్.టి.యూ విశ్వవిద్యాలయం ప్రధానద్వారం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన దీక్ష చేశారు. ఈసందర్భంగా ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందుస్తానీ మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులను వంచించారని, అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ సమస్యపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి, అర్ధాకలితో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అశోక్ నగర్, అమీర్ పేటల్లో అర్ధరాత్రి వరకు చదువుతూ అనారోగ్యం బారిన పడుతూ ఉద్యోగమో రామచంద్రా అని నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గోడు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుంటే కల్వకుంట్ల కుటుంబాన్ని శాశ్వత  రాజకీయ నిరుద్యోగులుగా చెయ్యాల్సి వుంటుంది అని హెచ్చరించారు. పాలన చేతకాకుంటే తప్పుకోవాలని, గొర్రెలు, బర్రెలు పంచి నిరుద్యోగులను వంచించడం మానుకోవాలని సూచించారు. అరెస్టులతో విద్యార్థి, నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలిని, ఉద్యోగాల భర్తీ కోసం టి.ఎస్.పి.ఎస్.సి క్యాలెండర్ విడుదల చేయాలని పీఆర్సీ నివేదిక ప్రకారం వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న లాక్షా తొంభై వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్ష చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి కె.పి.హెచ్.బి పోలీసు స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్, జేఎన్టీయూ నాయకులు చరణ్, నగర కార్యదర్శి రాకేష్, ప్రశాంత్, రామకృష్ణ, మనోజ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...