Followers

నెల్లికుదురులోప్రపంచ క్షయ నివారణ దినోత్సవ ర్యాలీ.

 నెల్లికుదురులోప్రపంచ క్షయ నివారణ దినోత్సవ ర్యాలీ..

నెల్లికుదురు, పెన్ పవర్.

 .ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంను  పురస్కరించుకొని బుధవారంమహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురుమండలం లోనిస్థానిక పిహెచ్ సి  ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆశావర్కర్లు ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు టీబీ వ్యాధి నిర్మూలనపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో వైద్యులు వరుణ్ తేజ్ మాట్లాడుతూ..క్షయ వ్యాధి కి భయపడాల్సిన అవసరం లేదని వ్యాధి సోకిన వారికి పూర్తిగా జబ్బు నయం అవడానికి చాలా కాలం నుంచి మందులు ఉన్నాయన్నారు.ఇది సోకకుండా ఉండడానికిమనం తీసుకునే  ఆహరంలో సమపాళ్ళలో పోషక పదార్దాలు ఉండే విదంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్లు గోపు రవి,సిహెచ్ మంగమ్మ ఏ.సక్రి ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...