ఆయుర్వేదిక్ దవాఖానా కు దక్కిన జాతీయ విశిష్టత పురస్కారం
చింతూరు,పెన్ పవర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా లోని కొవ్వూరు లో బుధవారం KVS ఫంక్షన్ హాల్ లో యువతేజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విశిష్టత పురస్కారాన్ని తూర్పుగోదావరి జిల్లా, చింతూరు ఆఫ్రిన్ ఆయుర్వేదిక్ దవాఖానా కు చెందిన షేక్.సుబహాని గారికి అందజేసారు.కరోనా సమయంలో చేసినటువంటి వీరి సేవలను గుర్తించి ఈ అవార్డు ను అందించడం జరిగింది. ఈ అవార్డు ను శ్రీవాణి నాచురోపతి కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ చంద్రపూర్ ఫౌండర్ డాక్టర్.రాహుల్ పదల్ వార్ గారు, విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ తాళ్లూరి సువర్ణ కుమారి గారు, యువతేజం ట్రస్ట్ చైర్మన్ కరీముల్లాగారు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు నాకు రావడానికి కారకులైన ఆప్రిన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్, జమాల్ ఖాన్ కి నా ధన్యవాదాలు తెలుపుతున్న అని అన్నారు.
No comments:
Post a Comment