Followers

ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి -డా. సి.హెచ్.మురళీకృష్ణ

 ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి -డా. సి.హెచ్.మురళీకృష్ణ




   





 గండేపల్లి పెన్ పవర్

 గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో  గల ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలల  మొదటి సంవత్సర  లో చేరిన  విద్యార్థులకు విద్య ప్రాముఖ్యాన్ని గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత మనోవికాస శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ డా.సి.హెచ్.మురళీకృష్ణ మాట్లాడుతూ పాలిటెక్నిక్ పట్టా  తో పాటు మంచి సంస్థలో ఉద్యోగంతో విద్యార్థి బయటకు రావాలంటే ఆంగ్లభాషపై పట్టు  వినూత్నంగా ఆలోచించడం, నూతన ఆలోచనలతో రాణించిన వారే తమ లక్ష్యాలను సాధించడం  సాధ్యం అని అన్నారు. విద్య అంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడం అని.. నేర్చుకున్న విద్య ను అభ్యసించడం ఆచరణలో పెడితే విద్యార్థులు మున్ముందుకు సాగుతూ ఉన్నతస్థాయి కి చేరుకుంటారని అన్నారు.ప్రతివిషయంపై అవగాహన కలిగి ఉండాలని ఆకలింపుచేసుకని అర్ధంకాని అంశాలను ఉపాధ్యాయుల నుండి తెలుసుకోవడానికి ప్రయత్నించాలని నిరంతరాయంగా నేర్చుకుంటూ తెలియని విషయాలు తెలుసుకోవడానికి సిగ్గు మొహమాటం లేకుండా ఉండటమే మంచి విద్యార్ధి లక్షణం అని ఈ మూడు సంవత్సరాల పాటు నేర్పిన విద్య మీ జీవిత కాలాన్ని ప్రభావం చూపుతుంది అని అన్నారు.ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్.కుమార్,డీన్.ఎ.వి.మాధవరావు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...