డుమ్మంగి పంచాయతీలో పారిశుద్ధ్యసమస్యలపై ప్రత్యేక దృష్టి
గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్
గుమ్మలక్ష్మీపురం మండలం డుమ్మంగి పంచాయతీలో పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పంచాయతీ కాలువలలో పూడిక తీతలు ముమ్మరంగా ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నామని డుమ్మంగి సర్పంచ్ పాలక క్రాంతికుమార్ ఓ ప్రకటనలో తెలియచేసారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అధికారకంగా ఏప్రిల్ 3వ తేదీ నుండి బాధ్యతలు ప్రభుత్వం అందచేస్తుందని కానీ అప్పటివరకు వేచి చూసి పారిశుధ్య పనులు చేపట్టెలోగా కాలువాల్లో మురుగునీటి సమస్యల వలన పంచాయతీలోని ప్రజలు ఆనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో పంచాయతీ కార్యదర్శితో సంప్రదించి ప్రత్యేక అధికారి పాలనలోని నిధులతో కాలువలలోని పూడిక తీతను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ క్రాంతికుమార్ తో పాటుగా యువజన నాయకుడు కడ్రక.మల్లేష్,పంచాయతీ కార్యదర్శి భీమయ్య పాల్గొన్నారు.
No comments:
Post a Comment