Followers

దివంగత నేత మాజీ సి.ఎం,వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి,సి.ఎం, జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన తూర్పు వైకాపా నాయకులు

 దివంగత నేత మాజీ సి.ఎం,వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి,సి.ఎం, జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన తూర్పు వైకాపా నాయకులు

విశాఖ తూర్పు, పెన్ పవర్

విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి మరియు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా నాయకులు అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి అని ఈరోజు మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గా ఒక సాధారణ గృహిణి అయినటువంటి గోలగాని హరి వెంకట కుమారి  ఎన్నిక చేపట్టడం చాలా విశాఖ తూర్పు నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టమని రానున్న రోజుల్లో విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడవాలి అంటే కచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  తీసుకున్న ఇటువంటి నిర్ణయం ఒక సువర్ణ అధ్యాయం అని ఏదైతే మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చి అనేక మైనటువంటి పదవుల్లోని కూడా ప్రతిపక్షాన్ని రిజర్వేషన్ కల్పించిన అటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దక్కుతుంది.

 అదేవిధంగా మన తూర్పు నియోజకవర్గంలో 15 డివిజన్ లో ఉండగా అందులో 13 డివిజన్లో మహిళల కేటాయించి ఆ 13 డివిజన్లో గెలుపొందిన అటువంటి ఒక మహిళకు మేయర్ పదవి కట్టబెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని అదేవిధంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ప్రధాన సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం గుర్తింపు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని అటువంటి ఇలాంటి సమయంలో మహానగర పాలక సంస్థ మేయర్ గా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మేయర్ గా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎన్నుకోవడం కూడా యాదవ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గోలగాని శ్రీనివాస్,మొల్లి అప్పలరావు, మువ్వల సురేష్ లక్ష్మి, గేదెల నాగరాజు లావణ్య, అక్కరమాని రోహిణి,పల్లా అప్పలకొండ, ఉమ్మడి దాసు స్వాతి నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ అప్పలకొండ, మాజీ కార్పొరేటర్ జగుపల్లి అప్పలరాజు,వార్డ్ ఇంచార్జ్ లు పీతల గోవింద్,పుకేళ్ళ  ధనలక్ష్మి శంకర్, రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృపా జ్యోతి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు శిరీష,పిళ్లాసత్యవతి, విద్యార్థి విభాగం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు కాంతరావు వార్డుల్లో ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా అధ్యక్షురాలు వార్డు అధ్యక్షులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...