Followers

వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాలి...అదితి గజపతిరాజు

వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాలి...అదితి గజపతిరాజు



విజయనగరం,పఎన్ పవర్ 

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా వైసీపీఅరాచకపాలనకు ముగింపు పలకాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి అదితి గజపతిరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం 26వడివిజన్లో, సాయంత్రం 20, 27, 28 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని దురాగాతాలకు తెగబడినా టీడీపీ ఎదురొడ్డి పోరాడుతూనే ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టణంలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టి, బెదిరించి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయించి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పధకాలు అమలులో నెం.1 స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఎన్నికల్లో ఎందుకు దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు, ప్రజల నుంచి తీర్పు కోరేందుకు వైసీపీ భయపడుతోందన్నారు.ఓడిపోతామనే భయంతోనే దౌర్జన్యాలు, ప్రలోభాలకు తెరతీసారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం శాంతియుత వాతావరణంలో సాగాలని, అటువంటి పరిస్థితులు కలిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పారదర్శక పాలన సాగాలంటే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో 26వ డివిజన్ అభ్యర్థి విజ్ఞపువెంకటలక్ష్మి, 20వ డివిజన్ అభ్యర్థి జోగచంటి, 27వ డివిజన్ అభ్యర్థి కంఠ మీనాకుమారి, 28వ డివిజన్ అభ్యర్థి సారిక వెంకటరమణ, పార్టీ నాయకులు ఐవిపి రాజు, విజ్ఞపు ప్రసాద్, కంఠఎర్రయ్య, కంది మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...