యువతకు స్ఫూర్తి కిరణం భగత్ సింగ్
కూకట్ పల్లి, పెన్ పవర్భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం కూకట్ పల్లి బీజేపీ ఇంచార్జ్ నాయినేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో వెంకట్ రావు నగర్ కాలనీలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమంలో నిప్పు కణికగా మారి ఎంతో మందిని రగిలించాడని, యువతకు స్ఫూర్తి కిరణం భగత్ సింగ్ అని, ఆయన సేవలను యావత్ భారతదేశం స్మరించుకుంటుందని అన్నారు. కేవలం ఇరవైమూడు ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశాడన్నారు. భగత్ సింగ్ తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్ నాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే విధంగా ముందుకు నడిపించారని తెలిపారు. ఈకార్యక్రమంలో నాగేశ్వరరావు, శివ, మహేష్ రావు, సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment