Followers

కోవిడ్ మహిళా వారియర్' పురస్కారం

 కోవిడ్ మహిళా వారియర్' పురస్కారం

విజయనగరం,పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్ , ఐ.పి.ఎస్., గారిని మంగళగిరి డిజిపి కార్యాలయంలో విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐ.పి.ఎస్., మార్చి 24న మర్యాద పూర్వకంగా కలిసి, ఆయన చేతులమీదుగా ఇటీవల జాతీయ మహిళా కమీషను ఇచ్చిన “కోవిడ్ మహిళా వారియర్” అవార్డును అందుకొన్నారు. ఈ సంరద్భంగా రాష్ట్ర డిజిపి విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారిని ప్రత్యేంగా అభినందించారు.కోవిడ్ 19 విపత్కర సమయంలో జిల్లా ఎస్పీ బి. రాజకుమారి నిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండి, ప్రజలకు అండగా నిలిచారు.కోవిడ్ పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించడం, వారిలో మనో ధైర్యాన్ని నింపారు. మాస్క్ ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా పోలీసు ఉద్యోగులతో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ప్రజలను చైతన్యపర్చడానికి జిల్లా ఎస్పీ స్వయంగా నడుం బిగించి అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం,ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తూ ఆడియోలు, లఘు చిత్రాలను రూపొందించి, వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వలస కార్మికులకు రాత్రనక, పగలనక సేవలందించారు. విపత్కర సమయాల్లో పోలీసు సిబ్బంది అందరికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రజలకు నిత్యం సేవలందిస్తూ, అందరి అభిమానాన్ని పొందారు.కోవిడ్ మహిళా వారియర్ గా అందించిన సేవలకుగాను రాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్ జిల్లా ఎస్పీ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా,జాతీయ మహిళా కమీషను జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని కోవిడ్ మహిళా వారియర్ గా ఎంపిక చేసింది. ఈ జాతీయ పురస్కారాన్ని ఇటీవల ఢిల్లీలో జరిగిన వేడుకలో కేంద్ర అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు శ్రీ ప్రకాష్జ వదేవకర్ చేతుల మీదుగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి ప్రదానం చేసారు. ఈ జాతీయ పురస్కారానికి తన పేరును నామినేట్ చేసిన రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ కు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...