ప్రపంచ టి.బి. నివారణ దినోత్సవం
ఆరిలోవ మెడికల్ ఆఫీసర్ డా. అనిత ఆధ్వర్యంలో.....
విశాఖ , పెన్ పవర్1882 వ సంవత్సరంలో జర్మనీ శాత్రవేత్త అయిన సర్ రాబర్ట్ కాక్ ఈ టి.బి. (క్షయ ) అనే బ్యాక్తీరియా ను కనుగొనడం జరిగింది . కనుక దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 24 న ఈ టి.బి. నివారణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనిని పురస్కరించుకొని నగరంలో ఆరిలోవ లో ఉన్న మునిసిపల్ హాస్పిటల్ లో టి.బి. అవగాహన సదస్సు కార్యక్రమం హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత అద్వర్యం లో జరిగింది.ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ టి.బి. వ్యాధి అనేది మైక్రో బ్యాక్తీరియం ట్యూ బెర్క్యూలోసిస్ అనే సూక్ష్మ క్రిమి వలన గాలి ద్వారా వచ్చే అంటు వ్యాదని , రెండు వారాలు మించి దగ్గు, జ్వరం , బరువుతగ్గడం , ఆకలి లేకపోవడం , ఛాతినొప్పి, కఫo లో రక్తపు జీరాలు పడటం వంటివి ఆ వ్యాధి లక్షణాలని , కనుక ప్రతిఒక్కరూ మాస్కు లు ధరించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ,ఆహారంలో తగిన పోషకాలను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొనవచ్చని , టి.బి. వ్యాధి దరిచేరకుండా చూడవచ్చని , ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి తగు వైద్యం చేయించుకోవాలని సూచిoచారు .అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ మనదేశంలో 2025 సం. నాటికి టి.బి. వ్యాధిని అంతమొందించడానికి తగిన చర్యలు తీసుకోవడం గర్వకారణమని ఆయన నినాదాన్ని‘’ టి.బి. ఓడుతుంది – దేశం గెలుస్తుంది ‘’ అని గుర్తు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిదిలు గా విశాఖ మేయర్ గోలాగని హరి వెంకట కుమారి, 13 వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత , ఆరిలోవ స్టేషన్ ఎస్.ఐ. గోపాలరావు , సెయింట్ ఆన్స్ ప్రదనోపాధ్యాయురాలు రోజ్ మేరీ లు హాజరైనారు. కార్యక్రమం అనంతరం టి.బి.యూనిట్ సిబ్బంది సూపర్వైజర్లు,ఎం.డి.జయపాల్, జి.రాజేష్, కె.వి.లక్ష్మీ, ఆర్.మణి , ఎస్..దుర్గారావు , ( లాబ్ టెక్నిషి యన్స్ ), సచివాలయ వార్డు హెల్త్ సెక్రటరీ లు , ఆశ కార్యకర్తలు అందరూ కలసి సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులతో మానవ హారంగా ర్యాలీ ను నిర్వహించి టి.బి. వ్యాధి నినాదాలతో ప్రజలకు వ్యాధి అవగాహనను కల్పించడం జరిగింది.
No comments:
Post a Comment