గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల గడువు పెంపు .ఈనెల 15 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం
ఆదిలాబాద్ ,పెన్ పవర్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ గురుకుల కళాశాలలో స్వేరోస్ వివిధ సంఘాలతో పోస్టర్లు విడుదల చేశారు.రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ డోంగ్రే తేమాజి శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమంలో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సులను అందిస్తున్నామని వివరించారు. విద్యార్థులు ఈనెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. వారికి ఏప్రిల్ 25న రాతపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు www.tswreis.in లేదా www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్, ఎస్ ఎస్ యూ ప్రధాన కార్యదర్శి నరేశ్, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరావు పాటిల్ ,ఎస్ ఎస్ యు ఉపాధ్యక్షుడు వినోద్,ఇచ్చొడ స్వేరోస్ అధ్యక్షుడు విశ్వబోధి,నాయకులు రాజ్ కుమార్, విద్యార్థులు,కళాశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment