ఎమ్మెల్సీ గా శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలి.
కేసముద్రం, పెన్ పవర్రాబోయే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున పోటీ చేస్తున్న సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని టి పి సి ఎల్ ఎ రాష్ట్ర పత్రికా విభాగం అధ్యక్షులు కడుదుల జనార్ధన్ కోరారు. గురువారం కేసముద్రం మండలం లోని తాళ్లపూసపల్లి, కల్వల, కేసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, శ్రీ వివేకవర్ధిని హై స్కూల్, కృషి స్కూల్, మహర్షి డిగ్రీ కాలేజీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రైవేట్ కళాశాల అధ్యాపకుల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న టి పి సి ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షులు సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్సీ గా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి, టి పి సి ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు రాజకీయ పార్టీలకి సంబంధించినవి కావని, కానీ రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేయడం ఆశ్చర్యమేస్తుంది అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిని గుర్తించి ఎన్నుకోవాలని పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టి పి సి ఎల్ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ కే రామారావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీణవంక రాజు, నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షులు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుదురుపాక జనార్ధన్, బుర్ర సుధాకర్, ధరావత్ శంకర్, బానోతు మంగీలాల్, సుమన్, మూల రాజి రెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment