కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దు...
ఆదర్శంగా నిలచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వంటిపల్లి పాపారావు తండ్రి కృష్ణమూర్తి..
పెన్ పవర్,ఆలమూరు
మండల కేంద్రంమైన ఆలమూరు గ్రామానికి చెందిన శ్రీ మురళికృష్ణ ఫారమ్స్ అధినేత ప్రముఖ పారిశ్రామిక వేత్త వంటిపల్లి పాపారావు తండ్రి అయిన కృష్ణమూర్తి శనివారం పెదపళ్ల పి హెచ్ సి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ప్రజలందరికీ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది అని ముందుగా వంటిపల్లి కృష్ణమూర్తి వ్యాక్సిన్ వేయించుకుని పలువురి కి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా వైద్యులు భవానీ శంకర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలోద్దని ఇది సురక్షితమైందని అయన అన్నారు వ్యాక్సిన్ తీసుకునే ముందు రోజు మంచి నిద్ర ఉండాలని అనంతరం తిరిగి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది,అశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment