Followers

కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్, బీజేపీ నాయకులు

 కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్, బీజేపీ నాయకులు


శంకర పట్నం, పెన్ పవర్

 తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో బీజేపీ తెరాస పార్టీల నాయకులు కవ్వంపల్లి గారి నాయకత్వన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.2023 ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పని చేస్తాం అన్నారు.తిమ్మాపూర్ మండలంలో గ్రామ గ్రామన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ తిమ్మాపూర్ మండలం నుండి పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకవచ్చి మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురావేస్తాo అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోరపెల్లి రమణ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.ఎల్ గౌడ్, జిల్లా కార్యదర్శి నేదునూరి ఎల్లయ్య జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, పోరండ్ల సింగల్ విండో డైరెక్టర్ గోపు మల్లారెడ్డి, బెజ్జంకి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మర రవీందర్ రెడ్డి మండల కో ఆర్డినేటర్ సమద్,పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...