గ్రామ పంచాయతీ,కార్మికులకు పిఆర్సీ వర్తింపజేయాలి..
కనీస వేతనం19 వేలు చెల్లించాలని ఏఐటియుసి:మంద వెంకటేశ్వర్లు..
ఖమ్మం, పెన్ పవర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్థిక బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ తో పిఆర్సీని ప్రకటించడం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులతో ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాల పోరాట ఫలితంగానే 11వ పిఆర్‌సి వచ్చిందని. ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తెలిపారు. ఏఐటీయూసీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం డిపిఓ వి.ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు.. అనంతరం మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాంటి ఆరోగ్య సంక్షోభాలు, వచ్చినప్పుడు ముందు వరుసరలో నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శక్తి వంచన లేకుండా గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సిబ్బంది సేవలందించారని. సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తున్నా ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తున్న వీరి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బందిపై కపట ప్రేమ బయట పడిందని అన్నారు. కాంట్రాక్ట్, ఉద్యోగుల్ని, హోంగార్డులను, అంగన్ వాడీ, ఆషా వర్కర్లను, వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులను 11వ పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సిబ్బందిని విస్మరించడం సమంజసం కాదని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం పునరాలోచించి, గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సిబ్బందికి కూడా పీఆర్సీని వర్తింపజేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు రూ.19,000/- వేల వేతనం, కేటగిరి వారీగా పీఆర్సీ నిర్ణయించిన గ్రేడ్ ల ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పంచాయతీ యూనియన్ నాయకులు జి.రాందాస్,మంగిలాల్, మేళ్ళచెర్వు రాజగోపాల్, భద్రయ్య, బెల్లంకొండ శ్రీను,డి.బాబురావు,టీ. ప్రసాద్,పెనుగూరి సీతారాములు,వి. కనకమ్మ,బి.రేణుక,కె. జాను, బీమా,నరేందర్ రెడ్డి,శ్రీనీవాస్ రెడ్డి, కృష్ణ రెడ్డి,మల్లమ్మ, నాగభూషణం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment