కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి
పెన్ పవర్, కందుకూరు
ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పట్టణంలో సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతున్నామని కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 31వ తేదీ కోటా రెడ్డి నగర్, తూర్పు వడ్డీ పాలెం సచివాలయాల్లో, 2వ తేదీ శ్రీనగర్ కాలనీ, శ్రీరామ్ కాలనీ సచివాలయాల్లో, 5వ తేదీ బూడిద పాలెం, కోటు వారి స్ట్రీట్ సచివాలయంలో, 7వ తేదీ గుర్రం వారి పాలెం, ఎర్రవడ్డీపాలెం సచివాలయం, 9వ తేదీ కోటు వారి స్ట్రీట్, బిలాల్ నగర్, సచివాలయంలో 12వ తేదీ ఐ ఎస్ రావు నగర్, జనార్ధన్ కాలనీ సచివాలయాల్లో, 14వ తేదీ నల్లమల్ల వారి తోట, సంతోష్ నగర్ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేయనున్నట్లు మనోహర్ తెలిపారు. కావున ఈ తేదీలలో తమ తమ ఏరియాలో గల సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని కోరారు. సోమవారం చెరువు 8,9 వ వార్డు కు సంబంధించిన సచివాలయం పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ వ్యాక్సినేషన్ వేయించుకున్న ప్పటికీ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.
No comments:
Post a Comment