హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా- పవన్ రావు దంపతులు...
ఆదిలాబాద్, పెన్ పవర్
ఆదిలాబాద్ మండలంలోని జామున్ దరి గ్రామంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో బుధవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా దంపతులు మండల టిఆర్ఎస్ నాయకులతో,గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీ బాయి ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు లకు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయ, లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం లేనటువంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఈరోజు నెంబర్ వన్ లో ఉంది అంటే అది కేసీఆర్ పుణ్యమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకన్న, అయ్యుబ్, గంగారెడ్డి, క్రాంతి, నర్సారెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment