ప్రభుత్వ భూముల్లో..అక్రమ నిర్మాణాలు..
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని రెవెన్యూ అధికారులు..
అధికార పార్టీ నేతల అండతోనే యదేచ్చగా నిర్మాణాలు..
కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయని, అధికారులు కబ్జాదారులు..
శంషీగూడా సర్వేనెంబర్ 57లో అక్రమ నిర్మాణాలు..
కూకట్ పల్లి, పెన్ పవర్ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండగా కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ స్థలాలను పరీరక్షిస్తాం అని చెపుతుండగా, అధికార పార్టీ నాయకుల అండ దండలతో, అధికారులు భాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.. దీనితో కోట్లు విలువజేసే ప్రభుత్వభూములు పరాధీనం అవుతున్నాయి. కూకట్ పల్లి మండలం శంషిగుడా గ్రామ సర్వే నెంబర్ 57లో రికార్డుల ప్రకారం మొత్తం రెండువందల డెభై నాలుగు(274.33)ఎకరాల ముపైమూడు గుంటల, ప్రభుత్వ భూమి ఉంది. కొంతమంది ప్రయివేటు వ్యక్తులు ఈ భూములు మావి అంటూ కోర్టుల్లో తెచ్చుకున్న ఫైనల్ డిక్రీలపై సుప్రీంకోర్టు సదరు భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెవెన్యూశాఖ సర్వే నెంబర్ 57లోని భూములను స్వాధీనంలోకి తీసుకొని ప్రభుత్వ సూచిక బోర్డ్ లను ఏర్పాట్లు చేశారు.. తాజాగా కబ్జాదారులు ప్రభుత్వ భూమిని చూచించె సూచిక బోర్డ్ లను తొలగించి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈక్రమంలోనే పలు ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా స్లాబులు వేస్తూ భవన నిర్మాణాలు చేపడుతున్నారు.. కూకట్ పల్లి మండలం శంషిగూడ ప్రభుత్వ పాఠశాల పక్క సందులో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇటీవల కొందరు కబ్జాదారులు స్లాబులు వేస్తూ నిర్మాణం చేపట్టారు. దీనిపై స్థానిక తహశీల్దార్ కు ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీంతో వరుసగా ఆర్డీవోకు, కలెక్టర్ కు అక్రమ భవన నిర్మాణంపై పలు ఫిర్యాదులు చేశారు. ఐనప్పటికీ అట్టి నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక మండల రెవెన్యూ అధికారుల తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.. కోట్లలో విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమార్కులకు అప్పగిస్తున్నారని, కబ్జాదారులు ప్రభుత్వ భూములతో కోట్లు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఇకనైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూములు కబ్జా అయిన వాటిని స్వాధీనం చేసుకొని ఆక్రమణకు పాల్పడిన కబ్జాదారులపైన, అక్రమ నిర్మాణదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానికులు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment