కరోనా పై అపోహలు వద్దు అవగాహన ముఖ్యం.వైద్యులు డాక్టర్ రవి
చిన్నగూడూరు, పెన్ పవర్స్థానిక మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో కరోన రాపిడ్ రెస్పాన్స్ సందర్శించి గురువారం నాడు విద్యార్థులను పరీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా మిగతా విద్యార్థినిల కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదని అన్నారు. కానీ కరోనా వైరస్ సోకకుండా ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ లు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సరస్వతి, హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, ఏ ఎన్ ఎం వనిత, అనిత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment