Followers

భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన...ఐద్వ నాయకురాలు ఆర్.వరలక్ష్మి

 భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన...ఐద్వ నాయకురాలు ఆర్.వరలక్ష్మి

మహారాణి పేట, పెన్ పవర్

ఈ రోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జగదంబ జోన్ ఆధ్వర్యంలో ఎమ్.సుబ్బారావు అధ్యక్షతన పూర్ణ మార్కెట్ లో ఉన్న దుర్గాంబ టెంపుల్ వద్ద ఐద్వ నాయకురాలు ఆర్.వరలక్ష్మి, భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పి.ఏ.వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుకదేవ్ లు వారికోసం పుట్టలేదని దేశంకోసం సంపూర్ణ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు అని తెలియజేశారు. అనంతరం వై. రాజు మాట్లాడుతూ మహానుభావుల స్ఫూర్తి తో ఇప్పుడు నరేంద్రమోడీ నుంచి ఈ దేశాన్ని కాపాడాలని 1.దేశీయ ఆస్తులు స్టీల్ ప్లాంట్ లాంటి పబ్లిక్ సెక్ట్రార్ని కాపాడాలి అని.2. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిచవసర వస్తువుల ధరలను తగ్గించాలని.3.రైతులకు వ్యేతిరెకంగ వచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని.4.కార్మిక చట్టాలను రక్షించాలని, వీటి నిమిత్తం ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చంద్రమౌళి సంతోష్ లు భవనిర్మన కార్మికుల నాయకులు కె.నరసింగరావు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...