Followers

జిఓపీ క్లబ్ అద్వర్యం లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణి

 జిఓపీ క్లబ్ అద్వర్యం లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణి

తార్నాక,  పెన్ పవర్

మల్లాపూర్ లోని సెయింట్ ఆన్స్  డిగ్రీ & కాలేజీ ఫార్ విమెన్ జిఓపీ క్లబ్ ఆధ్వర్యంలో  పేద విద్యార్థిని , విద్యార్థులకు స్కూల్ బ్యాగులు , షూ ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా  స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొని  విద్యార్థులకు బ్యాగులను అందించారు. ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చేయూత నిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు తీరిక సమయంలో గొప్ప వాళ్ల చరిత్రలు చదవాలని సూచించారు. బతకడానికి, జీవించడానికి ఉన్న తేడాను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ ఎమ్మి , విమల , హేమలత , పల్లవి , కళ్యాణి , జిఓపీ క్లబ్ సభ్యురాలు వాసవి మేఘన, నాంరీన్ , అలంకృత , స్థానిక తెరాస నాయకులు పీఆర్ ప్రవీణ్, జీకే రమేష్ , కర్నె వినయ్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...