క్రమశిక్షణతో ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి
మందమర్రి, పెన్ పవర్
కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి సంస్థలో ఉద్యోగం పొందిన నూతన కార్మికులు క్రమశిక్షణతో తమ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ సూచించారు. మంగళవారం స్థానిక జిఎం కార్యాలయంలో 14 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమర్రి ఏరియాలో ఇప్పటివరకు 932 మంది వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులు అండర్ గ్రౌండ్ లో విధుల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని, సంస్థకు లాభాలు వచ్చినప్పుడే సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లావచ్చునని పేర్కొన్నారు. యువకులు తమ విధులకు గైర్హాజరు కాకుండా, విధులను రక్షణతో సక్రమంగా నిర్వహిస్తూ సింగరేణి లాభాల బాటలో భాగస్వాములు కావాలని సూచించారు. తల్లిదండ్రులు మరవకుండా వారికి ఎప్పుడు అండగా ఉండాలన్నారు. దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో కారుణ్య నియామకాలు కొనసాగడం లేదని సింగరేణిలో రెండవ తరానికి ఉద్యోగాలు రావాడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, టీబీజీకేఎస్ జిఎం కమిటీ మెంబర్ రమణ, ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, డివైపిఎం శ్యామ్ సుందర్, సీనియర్ పివో సత్యబోస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment