Followers

పదవీ విరమణ వేడుకలకు హాజరైన విశాల్ గౌడ్..

 పదవీ విరమణ వేడుకలకు హాజరైన విశాల్ గౌడ్..

జీడిమెట్ల, పెన్ పవర్

రామలింగారెడ్డి మాస్టర్ ప్రభుత్వ పాఠశాలలో చేసిన సేవలు చిరస్మరణీయం అని టిఆర్ఎస్ నాయకుడు కే.పీ.విశాల్ గౌడ్ పేర్కొన్నారు..132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలింగ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి కె. పి. విశాల్ గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేసి, రామలింగారెడ్డి దంపతులను శాలువాతో సత్కరించారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రామలింగ రెడ్డి చేసిన సేవలను విశాల్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి యం.ఇ.ఒ. ఆంజనేయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఖాజా పాషా, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, రామ్మోహన్ రెడ్డి, విజయ రాణి, దానయ్య, గోపాల్, శ్రీనివాస్, వార్డ్ మెంబర్ ఇంద్రారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ది మల్లేశం,మురళి గౌడ్, నరహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...