ఆజాదీ క అమృత్ మహోత్సవాలు పై అవగాహన ర్యాలీ....రూపాకుల రవికుమార్
మహారాణి పేట, పెన్ పవర్
శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ,ప్రకృతి చికిత్సాలయం సహకారంతో మహారాణి పేట కృష్ణా నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ ఆజాదీ క అమృత్ మహోత్సవాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతి ఆశ్రమం దగ్గర మార్చ్ 12వ తేదీ నుంచి ప్రారంభించారని1922 వ సంవత్సరం నాటికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని వివిధ నగరాలలో 75 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రధాని మోడీ తెలియజేశారు. 1930 మార్చి 12వ తేదీన గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి దండి యాత్ర ప్రారంభించారని ఇదే స్ఫూర్తితో నేడు ప్రధాని మోడీ ప్రారంభించారని అన్నారు.దండి యాత్రను గాంధీజీ 21 రోజులపాటు చేశారని అన్నారు.నేటి యువతరానికి స్వాతంత్ర ఉద్యమం చరిత్ర మరియు స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం విశిష్టత గురించి తెలియజేసే కార్యక్రమము ఇది 75 సంవత్సరాలలో మనదేశం సాధించిన ఆర్ధిక ప్రగతి,వృద్ధి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయుట మనము దేశంలో ఉగ్రవాదాన్ని ,విచ్ఛిన్నకర శక్తులను దీటుగా ఎదుర్కొన్నామని దేశాభివృద్ధికి సరికొత్త ఆలోచనలతో రూపుదిద్దుకుందని నేడు దేశంలో నాణ్యమైన వైద్య సేవలు,ఆధునిక శాస్త్ర పరిజ్ఞానమును అభివృద్ధి చెంది,అభ్యుదయ భావాలతో మన జీవనశైలి మారిందని ,పేదరిక నిర్మూలనకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని ,నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు పరిచి ,లింగ సమానతను అభివృద్ధి చేస్తున్నారని, బేటీ బచావో బేటీ పడావో అటల్ పెన్షన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం,జన్ ధన్ యోజన ,కస్తూరిబా గాంధీ బాలిక విద్య ,గ్రామీణ సడక్ యోజన వీధి విక్రయదారులు అభివృద్ధి కోసం ముద్రా రుణాలు,వలస కార్మికుల కోసం వన్ నేషన్ వన్ రేషన్ పథకం భారతావని అంతటా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వీరికి పథకాలు అమలు చేశారు.
భారత హైవేస్ ప్రాజెక్ట్ ,సాగరమాల ప్రాజెక్ట్ అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి ,మెట్రో రైలు ఏర్పాటు ఎక్స్ప్రెస్ వే ,గుజరాత్లోని గిఫ్ట్ సిటీ ఆధునిక నగరాల నిర్మాణం భారత శాస్త్రవేత్తల అభివృద్ధికి నిదర్శనం గా ఇస్రో ద్వారా అంతరిక్ష పరీక్షల నిర్వహణ అమృత పార్కుల అభివృద్ధి పార్కులలో జిమ్ము ల నిర్వహణ ,స్వచ్ఛ భారత్ పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేయుట దేశంలోని ముఖ్యనగరాలను స్మార్ట్ సిటీలు గా అభివృద్ధి చేయుట భారత శాస్త్రవేత్తల మేధస్సు లో నుంచి జన్మించిన దే కరోనా వ్యాక్సిన్ అని ,ప్రపంచ స్థాయిలో మన వ్యాక్సిన్ కి మంచి గుర్తింపు వచ్చిందని అని అన్నారు.ఆజాదీ క అమృత్ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఎంపిక చేసిన 75 ప్రాంతాలలో దేశ నాయకులు స్వాతంత్ర సమరయోధుల జాతిపిత, నెహ్రూ, మంగళ్ పాండే, పటేల్ , లాలాలజపతిరాయ్, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి,సరోజినీ నాయుడు, గోపాలకృష్ణ గోకులే పింగళి వెంకయ్య,నేతాజీ ,భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్,మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్,జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే దుర్గాబాయి దేశ్ముఖ్, భారత రత్నాలు వాజపేయి, ఏ.పి.జె.అబ్దుల్ కలాం,ఆనాటి తరం నుంచి నేటి తరం వరకు మహానీయుల త్యాగ ఫలితాలను గుర్తు చేసే విధము గా నిర్వహించే చిత్రలేఖనం, చిత్ర పటాలతో ఎగ్జిబిషన్స్ నిర్వహించాలని నేటి యువతకు అవగాహన కల్పించాలని ప్రధాని మోడీ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు అందరూ సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీలో డాక్టర్ ఎస్ శ్రీ లక్ష్మి ,ఎస్ మహేష్ ,ఎస్ చాతుర్య ,డుటి,డాక్టర్ వై.లక్ష్మణరావు,గేదెల శ్రీహరి,మౌనిక, కిరణ్,మెహర్ బాబా, బలరాం,అప్పారావు, ఎంఎస్ నాయుడు,నిర్మల, శారద,మంగ,బంగారమ్మ , మల్లమ్మ మొదలగువారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు .
No comments:
Post a Comment