విధిగా మాస్కు ధరించండి : ఎసిపి శివ కుమార్
పెన్పవర్, మల్కాజిగిరి
కుషాయిగూడ ఏసీపీ శివ కుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్, డి ఐ గురువారెడ్డి కరోణ (కోవిడ్ -19) మహమ్మారిని అరికట్టడానికి మాస్కులు విధిగా ధరించాలని కుషాయిగూడ ఏసీపీ శివ కుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్, డి ఐ గురువారెడ్డి లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో మాస్కులు విధిగా ధరించాలని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఏసీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈసీఐఎల్, ఎస్ రావు నగర్, నేతాజీ నగర్, చక్రిపురం,, ఏ.ఎస్.రావు నగర్, రాధిక, కుషాయిగూడ, చౌరస్తాలో, ఆర్టీసీ బస్సులో, జనసంచారం గల వివిధ జంక్షన్లలో పోలీసులు మాస్కులు ధరించడం పై ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించండి పక్షంలో ఎన్.డి.ఎం చట్టప్రకారం ₹1000 రూ జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కరోనా కోవిడ్ 19 మహమ్మారిని తరిమికొట్టాలని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు అనంత చారి, బొలిశెట్టి శ్రీనివాస్, లింగస్వామి, మదన్ లాల్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment