సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలోఉచిత కంటి వైద్య శిబిరం
గోకవరం,పెన్ పవర్మండల కేంద్రమైన గోకవరం గ్రామం నందు గల స్థానిక గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణము నందు సనాతన ధర్మ ప్రబోధనా స్వచ్ఛంద సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తోట సాయిబాబు మరియు ప్రధాన కార్యదర్శి అక్షింతల రాజా ఆధ్వర్యంలో సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సత్య సాయి సేవ సమితి తూర్పుగోదావరి జిల్లా ఆర్గనైజర్ తుమ్మలపల్లి చిట్టిబాబు మాట్లాడుతూ గ్రామమునందు గల స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు 29_3_2021వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని కావున గోకవరం మండలం పరిసర ప్రాంతాల నుండి వైద్య సేవలు అవసరం ఉన్న వాళ్ళందరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొని మా ఉచిత వైద్య సేవలు పొందాలని అన్నారు ఈ వైద్య శిబిరం నందు కంటి సంబంధిత మరియు తలపోటుకు సంబంధించిన వైద్య సేవలు అందించడంతో పాటుగా అవసరమైనవారికి ఉచితంగా మందులు, కళ్ళజోళ్ళు ఇవ్వడంతో పాటుగా శస్త్రచికిత్సలు నిర్వహించునని తెలిపారు. అదేవిధంగా వైద్య శిబిరానికి వచ్చేటటువంటి వారు వారితో పాటుగా వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్లు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు అన్నారు. ఈ సమావేశంలో బత్తుల వెంకన్నబాబు, పిల్లంగోరు పాపారావు,కొరిపిల్లి అప్పలస్వామి,గుదే శివశంకర్, చెన్నంశెట్టి మహేష్,చందo వెంకటేశ్వరరావు,కోడూరి శ్రీనివాసు, కొత్తపల్లి సత్యనారాయణ,గోకాడ జగదీష్,కొప్పాక భాగ్యరాజు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment